onion uses

ఉల్లి ఉపయోగాలు


ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంట అందుకే పప్పు చేసిన పచ్చడిచేసిన బిర్యానీ చేసిన ఏ తాలింపు వేసిన ఇది పడాల్సిందే ఇది లేకుండా ఒక్కరోజు కూడా గడవదు వంటింట్లో.  మనకు ఇంతవరకు దీన్ని వంటల్లో వాడుతాము అని మాత్రమే తెలుసు ఎదో రుచి కోసం వేస్తాం అని అనుకుంటాము కానీ దీనివల్ల మనకు జరిగే మంచి మాత్రం వందలోపదిమందికి కూడా తెలియదు.

కోసేటప్పుడు ఎన్ని కన్నీళ్లు తెప్పిస్తుందో మనకు అంతకుమించి మేలు చేస్తుంది అంతేకదామరి కష్టపడకుండా ఏ  సుఖం రాదో అలాగన్నమాట.ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నా అంటే మాములుగా ఉల్లిపాయ తినండి అది తింటే మంచిది అంటే మన మైండ్ కి ఎక్కదుకదా!ఇప్పుడు మనకు ఇది ఎలా ఉపయోగపడ్తుందో చెప్తాను అంతేకాదు ఎలా తినాలో కూడా…

ఈ  మధ్యలో అంటే ఇప్పుడు కాదనుకోండి ఎన్నో సంవత్సరాలుగా ప్రతి మనిషిని మానసికంగా కృంగదీసి వచ్చింది అంటే మనం పోయేదాకా మనతోనే ఉండే మహమ్మారి అదేనండి షుగర్ మధుమేహం దీన్ని రోజుకొక ఉల్లిపాయ  తినడంవల్ల ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చని తెలుసా మీకు! నిజమండి ప్రతిరోజూ ఒక ఉల్లిపాయ పచ్చిగా తినడంవల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చని మన డాక్టర్లే చెప్తున్నారు.

sugar levels

పచ్చిగా ఎలా తింటామండీ బాబు అని ఆలోచిస్తున్నారా మధ్యాహ్నం పెరుగన్నంలో అలా  ఒక ఉల్లిపాయ పెట్టుకోండి. ఆఫీసులకి వెళ్తాం అక్కడ ఎలా తింటాం అంటే నైట్ చపాతీలోకి తినొచ్చు అన్నంలో తినొచ్చు ఎలాగైనా తినొచ్చండి మన ఆరోగ్యం కోసమేకదా.

 

మన జుట్టు కి కూడా ఏది ఒక సౌందర్య సాధనంగా పనిచేస్తుంది తెలుసా వెంట్రుకలు ఊడిపోకుండా మెత్తగా నల్లగా నిగనిగలాడేలా చేసే గుణాలు ఉల్లిపాయతో ఉన్నాయి . వారానికి రెండుసార్లు కుదరకపోతే ఒక్కసారి అయినా  ఉల్లిపాయ కుదుళ్లకు పట్టించడంవల్ల జుట్టురాలే సమస్యని అరికట్టవచ్చు. అంతేకాదు క్రమంతప్పకుండా రోజు ఉల్లిపాయ రసం పెడితే పోయిన జుట్టుకూడా తిరిగి వస్తుంది.నిజమండి ఇప్పుడు దీన్ని చాలామంది బట్టతలకు దివ్యౌషధంలా ఉపయోగిస్తున్నారు.

a-man-with-hair-loss

మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో మన గోళ్లను చూసి చెప్పేస్తుంటారు చాలామంది డాక్టర్లు అయినా  పెద్దవాళ్లయినా .  కొంతమందికి గోర్లన్నీ మొద్దుబారిపోయి ఉంటాయి  అలాంటివాళ్ళు గనక ఉల్లిపాయ తింటే వాళ్ల గోర్లు పదునుగా తయారవుతాయి  ఎంత అంటే వాటితోనే ఎదుటివాళ్ళని చంపేయొచ్చు హహహ ….

ఇంకా ఎన్నో మన జీర్ణవ్యవస్థ వ్యాధుల్ని కూడా నియంత్రించుకోవచ్చు. తినలేకపోవడం తిన్నది అరగకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం నియంత్రించుకోవచ్చు. ఎన్ని ఉపయోగలున్నా దివ్యామృతాన్ని ఎవరైనా వదులుకోగలమా ఇంకేంటి మరి ఏ రోజునుంచే తినడం మొదలుపెట్టండి మాస్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *