die plant & weight loss

ఎలాంటి డైట్ లేకుండా కడుపునిండా తిని అధిక బరువు తగ్గడం ఎలా?


ఆ అమ్మాయి ఎంత సన్నగా నాజూకుగా ఉంది urgent గా రేపటి నుంచి డైట్ exercise చేయాలి నడుముని నాజూకుగా చేసేయాలి, అబ్బా ఈ  డ్రేస్ ఎంత బాగుంది హ్మ్ ఎం చేస్తాం మనకు పట్టదులే ఎలాగైనా తగ్గాలి, జీన్స్ బాగా టైట్ ఐంది రేపటి నుంచి అన్నం తగ్గించేయాలి యోగ స్టార్ట్ చేయాలి, ఆమ్మో వన్ మంత్లో పెళ్లి పట్టుచీర బొమ్మకి కట్టినట్లుండాలి ఎలాగైనా తగ్గాలి.

ప్రతి అమ్మాయికి ఇదే గొడవ ఎలా తగ్గాలి ఎం చేయాలి డైట్లు , యోగాలు , చివరికి స్లిమ్మింగ్ టాబ్లెట్స్ అన్ని ప్రతిదీ ట్రై చేయాలి అనుకుంటాం కానీ ఆ ఒక్కటి మనతో అవ్వదు. నైట్ నిద్రపోయేటప్పుడు అనుకుంటాం రేపు 5కి పక్క లేవాలి వాకింగ్ చేయాలి అని 8 9 అయినా అహ  వాకింగ్ వాయిదా పడాల్సిందే మనకు మెలుకువ రాదుగా.

డైట్ అంటాం ఆఫీస్ కి వెళ్తాం ఎం తినకుండా అక్కడ పని స్ట్రెస్ కడుపులో ఆకలి కేకలు బాస్ పని కేకలు రెండు ఒకేసారి మొదలవుతాయి. అప్పుడు నిరసాలు తలనొప్పులు అందులోనుంచే ఫ్రాస్ట్రేషన్లు వచ్చేస్తూ ఉంటాయి మరి తినకపోతే లోపలున్న బకాసురుడు ఊరుకుంటాడా నానా హంగామా చేసేస్తాడు.

మనలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం అన్ని తింటూ హాయిగా సన్నగా అవ్వడానికి ఏమైనా చితకాలు ఉంటె బాగుంటుంది అని మరి అలాంటి వారికోసమే ఈ ఆధ్భూతమైన చిట్కా నా ఎక్స్పీరియన్స్ తో మీకోసం.ఏంలేదండి ఏ డైట్ అయ్యో డైట్ కాదని మల్లి డైట్ తో  స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా లేదండి ఆలా అంటే మీరు బాగా కనెక్ట్ అవుతారు కదా మైండ్ కూడా డైట్ చేస్తున్న ఫీలింగ్ లో ఉంటుంది అందుకని హహహహ.

పొద్దున్నే కోడికూయ్యగానే లేచే అలవాటు మనకు చాలా తక్కువ 5కి లేవండి వాటర్ తాగండి మళ్ళి వాకింగ్ చేయండి మల్లి వాటర్ తాగండి మల్లి ఒకటికి రెంటికి వెళ్ళండి మల్లి రిలాక్స్ అవ్వండి మల్లి వాటర్ తాగండి అబ్బా అబ్బా మనది కడుపా లేక చెఱువా పొద్దున్నే ఇంత  తాగడానికి. ఇలాగేతాగి రెండు మూడుసార్లు ఆఫీస్ లో పరిగెత్తితే మనకు ఏ రోగమో ఉంది అనుకుంటారు అంతేగా మరి!

అందుకే ఏం చేయాలి అంటే పొద్దున్నే ఎప్పుడు లేస్తారో అప్పుడు కొంచెం వేడినీళ్లలో ఒక నిమ్మకాయను పిండేసి తాగేయండి దీనివల్ల మనకు ఎన్ఱజి లెవెల్స్ సాయంత్రందాకా తగ్గకుండా ఉంటాయి త్వరగా అలిసిపోము వేడినీళ్లు అంటే గోరువెచ్చనివి అంతేకాని బాగా కాలేవి నోట్లోవేసుకుంటే ఇంకా మనం ఆ రోజంతా ఏం తినకానికి పనిరాకుండాపోతాం . టిఫిన్ తప్పకుండ తీసుకోవాలి టిఫిన్ అంటే ఒక 10 దోశలు 20 ఇడ్లీ కాకుండా రోజు 4 తినే అలవాటు ఉంది అనుకోండి ఏ రోజు రెండే తినండి మీకు తిన్నట్లు ఉంటుంది కడుపుకి లైట్గా ఉంటుంది లోపల ఉన్న మిక్సీ కి ఎక్కువ పని ఉండదు కాబట్టి చక చక తిరిగేస్తుంది.

లంచ్ అయినా అంటే రోజు తినేకంటే కొంచెం నాలుగు ముద్దలు తగ్గించి తినండి అన్నం తినే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తిన్న తర్వాత అరగంట ఆగి ఇంకో గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి అలాగే అలవాటు చేస్కోండి. అప్పుడే మనం తిన్న కొంచెం అన్నం అయినా త్వరగా జీర్ణం అయిపోతుంది అప్పుడు మలబద్దకం, గ్యాస్ ఇలాంటి బాధలు ఉండవు. ఆఫీస్ లో అయినా ఇంట్లో ఉన్న తినగానే ఒక 5,10 నిమిషాలు నడవండి అలాగే ఎక్కడ తిన్నారో అక్కడే ఉండకుండా, వెళ్లి వెంటనే సీట్స్ లో కూర్చోకుండా.

రాత్రికి ఎంత త్వరగా భోజనం చేయగలరో అంతత్వరగా తినేయండి చపాతీ కానీ రైస్ కానీ ఏదుంటే అది కానీ రోజుకంటే ఒక నాలుగు ముద్దలు తగ్గించి అదేంటండి మన ఫార్ములా. తిన్న తర్వాత అరగంట ఆగి ఇంకో గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. అంటే కొంచెంసేపు కబుర్లతో ఎలాగో మేలుకుంటాము.

దీనికితోడు కొంచెం లిఫ్ట్స్ లేకుండా స్టెప్స్ ఎక్కడం కొంచెం దూరానికి ఆటో అని అరవకుండా నడవడం ఇలాంటివి చేస్తే ఇంకా త్వరగా తగ్గొచ్చు.

అంతేనండి ఇంకా మీరు పెద్దగా ఎం చేయాల్సిన అవసరంలేదు కావాలంటే ఇదే మీరు చేసి చూ డండి నెలలోనే మీకు మార్పు కనిపిస్తుంది మార్పు మంచిదేకదండి. ఇంకేంటిమరి రేపటి నుంచే ఇది ఫాలో అయిపోండి నాజూగ్గా అయిపొండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *