sun heat

ఎలాంటి శారీరక వేడిమిని అయినా చిటికెలో మాయం చేసే చిట్కా


మే వెళ్లి జూన్ కూడా వచ్చేసింది కానీ ఈ భానుడి వేడి ఇంకా చల్లారలేదు ఇంకా మన మీద కోపంతో భగ భగ అంటున్నాడు. ఆ వేడిని చల్లార్చడం ఎవరివల్ల అయ్యేపని కాదు కానీ నేను మీకు ఇప్పుడే ఇచ్చే సలహావల్ల ఆ వేడినుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఎలా అంటారా ఒక లుక్ వేయండి ఇక్కడ.

ఎలాంటి వేడి నుంచి అయినా మనల్ని బయటపడేయగల దివ్యౌషదం మనకు ఏంతో సులువుగా దొరికేది మనం ఏంతో సులువుగా తీసేసేది అదేనండి మజ్జిగ. మజ్జిగ గురించా ఇంతసేపు చెప్పింది అని అలా తీసిపారేయకండి అసలు దాని మహిమ తెలిస్తే అన్నం కూరలు అన్ని మానేసి మజ్జిగ తాగే వందేళ్లు బ్రతికేస్తాం అంటారు.

అసలు మజ్జిగ తాగడం వల్ల మనకేంటి లాభం చూద్దాం.

butter milk

మన అమ్మమ్మల టైంలో అయితే ఉదయాన్నే అన్నంలో మజ్జిగపోసుకొని ఒక మిరపకాయో ఉల్లిపాయో నంచుకుని హాయిగా తిని పనులు చేస్కునేవాళ్ళు 80 90సంవత్సరాలు వచ్చిన వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతున్నారు కానీ మనం పొద్దున్నే ఇడ్లీ దోస పూరి ఇంకా ఇంకా ఏవేవో రుచిగా తిని 35, 40 వచ్చేసరికి అన్ని రోగాలకు వెల్కమ్ చెప్తున్నాం కొంచెం నడవాలి అంటే కాళ్లనొప్పులు కొంచెం నుంచోవాలంటే కీళ్లనొప్పులు.  ఇవన్నీ మజ్జిగ తాగితే పోతాయానేగా మీ అనుమానం ఖచ్చితంగా పోతాయి మీరు ప్రయత్నిస్తే.
అసలు ఈ నొప్పులన్ని ఎందుకువస్తాయి మన శరీరంలో ఎదో లోపంవల్లేగా అదేంటి అంటే  మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండటంవల్ల.  ఎప్పుడు చుసిన వేడి చేసింది వేడి చేసింది అని అనడం మనం వింటూనే ఉంటాం శరీరం వేడి చేయడంవల్ల మొదటగా మనకు వచ్చే ఇబ్బంది మల మూత్ర విసర్జన అవ్వకపోవడం ఇంకేముంది లోపల ఉన్న చెత్త వేస్ట్ అంత బయటకి పోతేనేకదా మనకు తేలికగా ఉండేది శరీరం అవి జరగకపోతే పొట్టలోనొప్పి, తలనొప్పి ఏదోలా ఉండటం అలసిపోయినట్లు అన్ని వచ్చేస్తాయి ఆ పని చేసుకుకోలేము. సరే ఇలా ఉందిగా మనం ఎలాగో ఆలా కొంచెం వేడిని తగ్గిద్దాం అనుకోరు  వెంటనే బిర్యానీ చపాతీలు చికెన్లు మతం మటన్లు ఇంకా ఆ పొట్టసంగతి భగవంతుడికే తెలియాలి. ఆలా కాకుండా మీకు బాగాలేదు అన్నప్పుడు మూడుపూటలా మజ్జిగ తాగండి 2,3 సార్లు ఒకటికి పరిగెత్యరంటే అంత  మళ్ళి మామూలైపోతుంది హహహ. ఇలా చెప్తుంటే మీకు నవ్వొస్తుంది కానీ ఎంత పెద్ద పెద్ద సమస్య అయినా చిన్నవాటితోనే మొదలవుతాయి. అందుకే మనం వాటిని చిన్న చిన్న పనులతోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.  నాకు తెలిసి రోజుకి రెండుపూటలా మజ్జిగ తాగే అంత చిన్న చిట్కా చిన్న పని మరొకటి లేదనుకుంటా…
ఎవరికీ తెలియదు కానీ మనకు ఎంతో ముఖ్యమైనది మనం అందరం కావాలి అనుకునేది అదేంటి అందం ముఖం ఒక్క మొటిమ ఒక్క మచ్చ కనబడితే దాన్ని వందసార్లు చూసుకుంటాం  అలాంటివి ఎందుకు వస్తాయి ఆయిల్ ఎక్కువ ఉన్నవి తింటే లేకపోతె వేడి చేస్తే. మరి అలాంటివి జరక్కూడదు అంటే బాడీని  కూల్గా ఉంచాలి అంటే మజ్జిగ తీసుకుంటే సరిపోతుందిగా.
చూసారా ఎన్నో రోగాలను మనం మజ్జిగను తాగడంవల్ల అసలు రాకుండా చేస్కోవచ్చు ఈ  బ్లాగ్ చదివి అమ్మో నేను మజ్జిగ తాగాను పెరుగుతినను అనేవాళ్ళు కూడా మారి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *